ఐపీఎల్ మ్యాచ్ ఆడేందుకు ధర్మశాలకు వెళ్లిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు, మ్యాచ్ సిబ్బంది, కామెంటేటర్లు శుక్రవారం రాత్రి క్షేమంగా ఢిల్లీకి తిరిగొచ్చారు. శుక్రవారం ఉదయం ధర్మశాల నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ స్థానిక పోలీసులు సుమారు 40-50 చిన్న వాహనాల్లో వారిని పంజాబ్లోని హోషియార్పూర్కు తరలించారు.
అక్కడ్నుంచి బీసీసీఐ.. భారత రైల్వే ఏర్పాటు చేసిన ప్రత్యేక వందే భారత్ రైళ్లో వాళ్లను ఢిల్లీకి తీసుకొచ్చింది.