పూణె: మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0తో వెనకబడిన టీమ్ఇండియా.. ఎలాగైనా మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నది. బెంగళూరు టెస్టు ఓటమి నుంచి బయటపడి పూణెలో (Pune Test) జోరు చూపాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా జట్టులో పలు మార్పులతో బరిలోకి దిగుతున్నది. పూణెలోని మోదీ స్టేడియంలో జరుగుతున్న సెకండ్ టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ లాథమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో సంప్రదాయ స్పిన్ పిచ్‌పై కివీస్‌ను తిప్పేసేందుకు భారత బౌలర్లు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో మొదటి టెస్టులో దారుణంగా విఫలమైన బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, సీమర్ సిరాజ్‌లపై టీమ్ మేనేజ్మెంట్ వేటు వేసింది. అదేవిధంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకు పెట్టారు. వారి స్థానంలో శుభ్‌మన్‌గిల్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించింది.
కాగా, బెంగళూరు టెస్టు ఇచ్చిన విజయంతో జోరుమీదున్న న్యూజిలాండ్.. స్పిన్‌కు స్వర్గధామమైన పుణెలో భారత్‌ను ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ లేకున్నా డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిఫ్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్ వంటి నాణ్యమైన ఆటగాళ్లు కివీస్ సొంతం. స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కావడంతో మిచెల్ శాంట్నర్‌ను మ్యాచ్ ఆడించే ఆలోచనలో ఆ జట్టు ఉంది. శాంట్నర్, అజాజ్ పటేల్‌తో పాటు రచిన్, ఫిలిప్స్ భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు. భారత్‌లో ఇంతవరకూ టెస్టు సిరీస్ గెలవని కివీస్.. పుణెలో అద్భుతం చేస్తే సరికొత్త చరిత్ర సృష్టించినట్టే!
జట్లు ఇవే..
భారత్: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, గిల్, కోహ్లీ, పంత్, సర్ఫరాజ్, జడేజా, అశ్విన్, బుమ్రా, ఆకాశ్
న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్), కాన్వే, యంగ్, రచిన్, మిచెల్, బ్లండెల్, ఫిలిప్స్, సాంట్నర్, సౌథీ, హెన్రీ, అజాజ్
🚨 Team Update 🚨
3⃣ changes for #TeamIndia in the 2nd Test
A look at our Playing XI 👌👌
Live – https://t.co/YVjSnKCtlI#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/O3DFFmNF7r
— BCCI (@BCCI) October 24, 2024