Duleep Trophy | వెస్ట్ జోన్‌కు ఆడనున్న పూజారా, సూర్యకుమార్ యాదవ్
Duleep Trophy : భారత జట్టు నయా వాల్ ఛటేశ్వర్ పూజారా(Cheteshwar Pujara)కు ఈరోజు ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) విఫలమైన అతడిని వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)కు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దాంతో, పూజరా త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో...
Duleep Trophy : భారత జట్టు నయా వాల్ ఛటేశ్వర్ పూజారా(Cheteshwar Pujara)కు ఈరోజు ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) విఫలమైన అతడిని వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)కు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దాంతో, పూజరా కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనపై వేటు వేయడంతో అసంతృప్తికి గురైన అతను దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఓకే చెప్పాడు. త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో సత్తా చాటాలని తహతహలాడుతున్నాడు.
ఈ టోర్నీలో అతను వెస్ట్ జోన్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. పూజరాతో పాటు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) కూడా అదే జట్టులో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆరు జట్లు పాల్గొంటున్న దులీప్ ట్రోఫీ బెంగళూరు వేదికగా జూన్ 28న మొదలవ్వనుంది. విండీస్‌తో టెస్టులకు ఎంపిక్వని సూర్య.. ట్రోఫీ తర్వాత వన్డే జట్టుతో కలవనున్నాడు.
కౌంటీల్లో రాణించి…
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో పూజారా తీవ్రంగా నిరాశ పరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో తక్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు. అంతకు ముందు ఇంగ్లండ్ గడ్డపై కౌంటీ(County)ల్లో అద్భుతంగా రాణించిన అతను ఫైనల్లో చేతులెత్తేశాడు. గత కొంతకాలంగా టెస్టుల్లో పూజారా పరుగులు సాధించడం లేదు. దాంతో, శివసుందర్ దాస్(Shiv Sunder Das) నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అతడిపై వేటు వేసింది. వెస్టిండీస్ టూర్‌కు టెస్టు, వన్డేలకు 16 మందితో కూడిన బృందాన్ని ఈరోజు కమిటీ ప్రకటించింది. భారత జట్టు విండీస్ గడ్డపై 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ 20 ఆడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

