హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో సీజన్లు మారుతున్నా..తెలుగు టైటాన్స్ తలరాత మాత్రం మారడం లేదు. శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 37-41 తేడాతో దబాంగ్ ఢిల్లీ చేతిలో ఓటమిపాలైంది.
ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో టైటాన్స్ మూడు పరాజయాలు ఎదుర్కొంది. టైటాన్స్ జట్టులో స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ 18 పాయింట్లతో చెలరేగినా జట్టును గెలిపించలేకపోయాడు.
మరోవైపు నవీన్‌కుమార్, అషు మాలిక్ 15 పాయింట్లతో ఢిల్లీ విజయంలో కీలకమయ్యారు. మ్యాచ్ ప్రథమార్ధంలో టైటాన్స్ దూకుడుగా ఆడినా..కీలకమైన ద్వితీయార్ధంలో ఢిల్లీ పుంజుకుని పోటీలోకి వచ్చింది.