పూణె: గత కొద్దిరోజులుగా క్రీడాభిమానులను అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) ముగింపు దశకు చేరుకుంది. లీగ్ దశలో రాణించి పాయింట్ల పట్టికలో టాప్-6లో నిలిచిన హర్యానా స్టీలర్స్, దబాంగ్ ఢిల్లీ (ఈ రెండు జట్లు నేరుగా సెమీస్ చేరాయి), యూపీ యోధాస్, పాట్నా పైరేట్స్, యూ ముంబా, జైపూర్ పింక్ పాంథర్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
గురువారం యూపీ.. తొలి ఎలిమినేటర్‌లో జైపూర్‌తో తలపడనుండగా రెండో ఎలిమినేటర్‌లో పాట్నా.. ముంబైని ఢీకొననుంది. ఎలిమినేటర్ విజేతలు శుక్రవారం (డిసెంబర్ 27) హర్యానా, ఢిల్లీతో తలపడతారు. ఈనెల 29న ఫైనల్ జరుగనుంది.