IPL 2025 : పద్దెనిమిదో ఎడిషన్ తొలి పోరులో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్యా(47) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అహ్మదాబాద్ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ బౌలర్లను ఉతికారేసిన అతడు.. ఫిఫ్టీకి 3 పరుగుల దూరంలో వికెట్ పారేసుకున్నాడు. 79కే రెండు వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ స్కోర్ నెమ్మదించింది. ప్రస్తుతం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(29), అజ్మతుల్లా ఒమర్జాయ్(16)లు ధనాధన్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు. పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 73 రన్స్ కొట్దిన పంజాబ్.. 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.
టాస్ ఓడిన పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యా(47) తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడాడు. సిరాజ్‌కు రెండు ఫోర్లతో స్వాగతం పలికాడు. అయితే.. రబడ తన తొలి ఓవర్లోనే డేంజరస్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(5)ను వెనక్కి పంపాడు. సిమ్రన్ ఔటయ్యాక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(29) జతగా ప్రియాన్ష్ రెచ్చిపోయాడు. అర్షద్ ఖాన్ వేసిన 5వ ఓవర్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదేసి 21 పరుగులు పిండుకున్నాడు. అరంగేట్రంలోనే అర్ధ శతకానికి చేరువైన అతడు రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోయి.. సాయి సుదర్శన్ చేతికి చిక్కాడు. దాంతో అఫ్గనిస్థాన్ స్పిన్నర్ ఐపీఎల్లో 150 వికెట్ల క్లబ్లో చేరాడు.