Prithvi Shah : భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shah) రంజీ సీజన్‌కు ముందు రెచ్చిపోయాడు. తనపై ఏమాత్రం కనికరం చూపించకుండా వదిలించుకున్న ముంబైపై సెంచరీతో గర్జించాడు. మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న షా.. మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ముంబై బౌలర్లను ఉతికారేస్తూ శతకంతో తన తడాఖా చూపించాడు. 140 బంతుల్లో మూడంకెల స్కోర్ అందుకున్నాడీ డాషింగ్ బ్యాటర్. ఓపెనర్ అర్షిన్ కులకర్ణితో కలిసి కసిదీరా బాదిన ఈ చిచ్చరపడిగు తొలి వికెట్‌కు 305 రన్స్ జోడించాడు. ఈ ఇద్దరి మెరుపులతో మహారాష్ట్ర పటిష్ట స్థితిలో నిలిచింది.
ఫామ్‌లేమి, క్రమశిక్షణారాహిత్యం కారణంగా భారత జట్టుకు దూరమైన షా.. ఆ తర్వాత రంజీల్లోనూ ఆడలేదు. సొంత టీమ్ అయిన ముంబై కూడా షాను పక్కన పెట్టేసింది. దాంతో.. దేశవాళీ 2025-26 సీజన్‌కు ముందు ముంబైని వీడిన అతడు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాడు. 2018లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన షా.. 2021లో చివరిసారిగా టీమిండియాజెర్సీ వేసుకున్నాడు.
Prithvi Shaw smashes 181 against his ex-team Mumbai in a warm-up match. 🔥 #India #Mumbai #Maharashtra #PrithviShaw #MrCricketUAE pic.twitter.com/xapybYAPQr
— Mr. Cricket UAE (@mrcricketuae) October 7, 2025
రంజీ ట్రోఫీకి ముందు పృథ్వీ షా మళ్లీ మునపటి ఫామ్ అందుకోవడంతో మహారాష్ట్ర బ్యాటింగ్ కష్టాలు తీరనున్నాయి. రంజీ సీజన్లో మహారాష్ట్ర ఎలైట్ గ్రూప్ బీ లో ఉండగా.. 42సార్లు రంజీ ఛాంపియన్ ముంబై ఎలైట్ గ్రూప్ డీలో ఉంది. రంజీ సీజన్ అక్టోబర్ 15న ప్రారంభం కానుంది. అదేరోజు జరుగనున్న తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 15న కేరళతో మహారాష్ట్ర తలపడనుంది.