హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్‌ను హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ (హెచ్బీహెచ్) ఓటమితో ముగించింది. సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో 1-3 (9-15, 13-15, 15-9, 13-15)తో ఆ జట్టును కోల్‌కతా థండర్‌బోల్ట్స్ ఓడించింది.
గ్రూప్ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌లకు గాను నాల్గింటిలో ఓడిన హెచ్బీహెచ్.. సెమీస్ అవకాశాలను ఆవిరి చేసుకుంది.