న్యూఢిల్లీ: జాతీయ క్రీడా బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఏండ్లుగా ఎదురుచూస్తున్న బిల్లు ఎట్టకేలకు చట్టంగా మారింది. ఈ విషయాన్ని మంగళవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ క్రీడారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ చట్టం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అయితే పార్లమెంట్లో మొదట తీసుకొచ్చిన బిల్లుకు రెండు ప్రధాన సవరణలు చేసి తిరిగి ప్రవేశపెట్టారు.
ఇందులో సమచార హక్కు చట్టం పరిధిని కుదించారు. కేవలం ప్రభుత్వ నిధులతో నడిచే జాతీయ క్రీడా అసోసియేషన్లు ఆర్టీఐ పరిధలోకి రానుండగా, బీసీసీఐకి ఇందుకు మినహాయింపు లభించింది. జాతీయ క్రీడా అసోసియేషన్లలో పదవులు ఆశించే వారు ఒకసారి పోటీచేసేందుకు అవకాశముండనుంది. వివాదాల పరిష్కారం కోసం స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు.