IND vs SL : కొలంబో టెస్టులో భారత జట్టు పట్టుబిగించింది. దేవ్‌దత్ పడిక్కల్(117), ధ్రువ్ జురెల్(115 నాటౌట్) శతకాలతో తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా.. రెండు కీలక వికెట్లతో శ్రీలంకను ఒత్తిడిలో పడేసింది. వర్షం అంతరాయం నడుమ కొన్ని ఓవర్లే సాధ్యపడడంతో లంక బతికిపోయింది. ప్రస్తుతం 494 పరుగుల ఆధిక్యంలో ఉన్న గిల్ సేన బౌలర్లు విజృంభిస్తే మూడో రోజు మ్యాచ్‌ను శాసించడం ఖాయం.
టెస్టు సిరీస్‌పై కన్నేసిన భారత జట్టు కొలంబోలో పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజూ మిడిలార్డర్ మెరుపులతో భారీ స్కోర్ చేసిన టీమిండియా.. మ్యాచ్‌ను తమ గుప్పిట్లోకి తీసుకుంది. ధ్రువ్ జురెల్(115 నాటౌట్), రిషభ్ పంత్(117) మెరుపులతో తొలి ఇన్నింగ్స్‌ను 5039 వద్ద డిక్లేర్ చేసిన గిల్ సేనకు బౌలర్ల విజృంభణ తోడైంది. ఆఖరి సెషన్లో శ్రీలంకను దెబ్బకొడుతూ ప్రసిధ్ కృష్ణ(1-1), మానవ్ సుతార్(1-6) చెరొక వికెట్ తీశారు. ఓపెనర్ లహిరు ఉడార(1)ను ప్రసిధ్ బోల్తా కొట్టించగా.. ప్రభాత జయసూర్య(2)ను ఎల్బీగా పెవిలియన్ పంపాడు మానవ్. దాంతో.. రెండోరోజు ఆట ముగిసే సరికి కమిల్ మిశారా (5 నాటౌట్) క్రీజులో ఉండగా 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది లంక. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు ఇంకా 495 పరుగులు వెనకబడి ఉంది.
Stumps, Day 2: A thoroughly dominant day comes to an end as #TeamIndia take two quick wickets to reduce Sri Lanka to 8-2 after declaring at 503-9. Earlier, Dhruv Jurel registered his 2nd Test ton.
Details – https://t.co/r9FgXSdsMf #TeamIndia | #SLvIND pic.twitter.com/hTKl01SJ3X
— BCCI (@BCCI) August 24, 2026
ఓవర్‌నైట్ స్కోర్ 300/5తో రెండో రోజు ఆట ఆరంభించిన టీమిండియా.. ధ్రువ్ జురెల్(115 నాటౌట్) సెంచరీ, రిషభ్ పంత్(63) అర్ధ శతకంతో భారీ స్కోరందించారు. లంక బౌలర్లను విసిగెత్తించిన ఈ జోడీ.. శతక భాగస్వామ్యంతో విరుచుకుపడింది. ప్రత్యర్థి పేస్, స్పిన్ బౌలర్లపై పంత్ ఎదురుదాడికి దిగగా.. జురెల్ తన స్టయిల్లో దంచేశాడు.
పంత్(63), జురెల్(115 నాటౌట్)

టీ బ్రేక్ అనంతరం.. వర్షంతో ఆట ఆలస్యంగా మొదలైనా.. జురెల్ టెస్టుల్లో రెండో సెంచరీ సాధించాడు. అతడి వంద కోసం ఎదురుచూసిన కోచ్ గౌతం గంభీర, కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. 504జ9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. లంక బౌలర్లలో ఫెర్నాండో నాలుగు వికెట్లు తీయగా.. జయసూర్య, నువాంత తలా రెండేసి వికెట్లు, లహిరు కుమార ఒక వికెట్‌తో రాణించారు.