న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30 : చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం పదోసారి యథాతథంగా ఉంచింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను పీపీఎఫ్, ఎన్ఎస్సీ కలుపుకొని అన్ని రకాల చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను మార్చిన కేంద్రం..ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు.
తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లో సుకన్య సమృద్ధి పథకం కింద 8.2 శాతం వార్షిక వడ్డీరేటును చెల్లిస్తుండగా..మూడేండ్ల టర్మ్ డిపాజిట్లపై 7.1 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. అలాగే అత్యంత ప్రజాదరణ పొందిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)పై 7.1 శాతం, పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీమ్‌పై 4 శాతం వడ్డీని చెల్లిస్తున్నది. 115 నెలల కాలపరిమితి కలిగిన కిసాన్ వికాస్ పత్రాలపై 7.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది.