IPL 2025 : గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన మోస్తరు ఛేదనలో లక్సో సూపర్ జెయింట్స్ ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(50) హాఫ్ సెంచరీ బాదాడు. ఆది నుంచి దూకుడుగా ఆడుతున్న అతడు 26 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. సాయి కిశోర్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ బౌండరీ కొట్టిన మర్క్రమ్, ఆ తర్వాత సింగిల్ తీసి అర్ధ శతకం సాధించాడు. మరో ఎండ్‌లో నికోలస్ పూరన్(37)సిక్సర్లతో రెచ్చిపోతున్నాడు.
కిశోర్‌కు చుక్కలు చూపిస్తూ.. వరుసగా రెండు సార్లుబంతిని స్టాండ్స్‌లోకి పంపాడీ చిచ్చరపిడుగు. దాంతో, లక్నో స్కోర్ 10 ఓవర్లకు114కు చేరింది. ఇంకా పంత్ సేన విజయానికి 68 రన్స్ అవసరమంతే. ఛేదనలో లక్నో 65 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ పడింది. ఓపెనర్‌గా వచ్చిన రిషభ్ పంత్(21) ఉన్నంత సేపు ధాటిగా ఆడి ఔటయ్యాడు. పవర్ ప్లే తర్వాత ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో సుందర్ చేతికి చిక్కాడు పంత్.
Solid starts from both sets of openers 💪
Can #LSG continue their momentum? 🤔
Updates ▶ https://t.co/VILHBLEerV #TATAIPL | #LSGvGT pic.twitter.com/5ft0bU82f6
— IndianPremierLeague (@IPL) April 12, 2025
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 180 రన్స్ కొట్టింది. ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(60), సాయి సుదర్శన్(56)లు మరోసారి చితక్కొట్టారు. ఎక్నాస్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అర్ధ శతకాలతో చెలరేగిన ఈ ద్వయం తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోర్‌కు బాటలు వేసింది. అయితే.. స్ట్రాటజిక్ టైమౌట్ తర్వాత పుంజుకున్న లక్నో బౌలర్లు గుజరాత్ మిడిలార్డర్‌ను క్రీజులో నిలవనీయలేదు. ఆఖర్లో షెర్ఫానే రూథర్‌ఫొర్డ్(22) ఒక్కడే మెరుపులు మెరిపించగా గిల్ బృందం నిర్ణీత ఓవర్లలో 180 రన్స్ చేయగలిగింది.