ఢిల్లీ: భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్‌బాబు వచ్చే ఏడాది జరుగబోయే క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి అర్హత సాధించేందుకు మరింత చేరువయ్యాడు. లండన్ వేదికగా బుధవారం రాత్రి ముగిసిన లండన్ చెస్ క్లాసిక్ 2025 ఓపెన్‌లో అతడు.. సెర్బియాకు చెందిన వెలిమిర్ ఇవిక్తో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచాడు.
కొద్దిరోజుల క్రితమే స్వదేశంలో జరిగిన చెస్ ప్రపంచకప్‌లో నాలుగో రౌండ్‌కే వెనుదిరిగిన ప్రజ్ఞానంద.. లండన్ చెస్ క్లాసిక్‌లో మాత్రం పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ టోర్నీలో వరుసగా మూడు గేమ్స్ గెలిచిన అతడు.. తర్వాతి మ్యాచ్‌లను డ్రా చేసుకున్నాడు. తొమ్మిది రౌండ్లుగా సాగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానందతో పాటు వెలిమిర్, అమీత్ ఘాషి (ఇంగ్లండ్) ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు.