చెన్నై: ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు సీఎం విజయ్ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం చెన్నై సచివాలయంలో ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల ప్రభుత్వ నగదు పురస్కార చెక్కును అందించారు.
ఈ సందర్భంగా సీఎం టేబుల్‌పైనే విజయ్, ప్రజ్ఞా ఫ్రెండ్లీ చెస్ మ్యాచ్ ఆడారు. ప్రజ్ఞా కొన్ని ఎత్తుల్లోనే సీఎంను చెక్‌మేట్ చేసి గెలిచాడు.