IPL 2025 : భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(61) దంచేస్తున్నాడు. సిక్సర్లు, ఫోర్లు బాదుతున్న అతడు అర్థ శతకం సాధించాడు. సిద్ధార్థ్ బౌలింగ్‌లో 4, 6 కొట్టిన హిట్టర్ సింగిల్ తీసి ఈ ఎడిషన్‌లో తొలి ఫిఫ్టీ నమోదు చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(17) తో కలిసి 64 పరగులు జోడించాడు. 8 ఓవర్లకు స్కోర్.. 90-1. ఇంకా పంజాబ్ విజయానికి 72 బంతుల్లో 82 పరుగులు కావాలి.
హిట్టర్లతో నిండిన లక్నో సూపర్ జెయింట్స్ పెద్ద స్కోర్ చేయలేకపోయింది. పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్() విజృంభణతో ఆది నుంచి తడబడుతూ సాగింది. పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోయిన జట్టును నికోలస్ పూరన్(44), ఆయుష్ బదొని(41)లు ఆదుకున్నారు. పంజాబ్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొంటూ లక్నో స్కోర్‌బోర్డును ఉరికించారు. అర్థ సెంచరీకి ముందు పూరన్ ఔటైనా.. అబ్దుల్ సమద్(27)తో కలిసి బదొని సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, పంత్ సేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగలిగింది.