IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జోరు కొనసాగుతోంది. మంగళవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య లక్నో సూపర్ జెయింట్స్(LSG)పై ఢిల్లీ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. 160 పరుగుల ఛేదనలో ఓపెనర్ అభిషేక్ పొరెల్(51), కేఎల్ రాహుల్(57 నాటౌట్)లు అర్ధ శతకాలతో విరుచుకుపడగా.. కెప్టెన్ అక్షర్ పటేల్(34 నాటౌట్) ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్‌తో కలిసి అజేయంగా నిలవడంతో ఢిల్లీ17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరో విక్టరీతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
ఐపీఎల్ 18వ సీజన్లో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్‌కు వాళ్ల సొంత గడ్డపైనే షాకిచ్చింది. తొలుత ముకేశ్ కుమార్(4-33) విజృంభణతో లక్నోను 159కే కట్టడి చేసిన ఢిల్లీ.. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. కుర్ర ఓపెనర్ అభిషేక్ పొరెల్(51) అదిరే ఆరంభం ఇవ్వగా.. కేఎల్ రాహుల్(57 నాటౌట్) మరోసారి మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరూ అర్ధ శతకాలతో విరుచుకుపడడంతో ఢిల్లీ లక్ష్యాన్ని కరిగించింది. పొరెల్ ఔటయ్యాక రాహుల్ జతగా కెప్టెన్ అక్షర్ పటేల్(34 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో రాహుల్ సిక్సర్ బాదడంతో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
𝙆𝙇 𝙍𝙖𝙝𝙪𝙡 𝙁𝙞𝙣𝙞𝙨𝙝𝙚𝙨 𝙤𝙛𝙛 𝙞𝙣 𝙎𝙩𝙮𝙡𝙚 💥
Unstoppable 57* from Rahul seals the victory for #DC and a double over #LSG 💪
Scorecard ▶️ https://t.co/nqIO9mb8Bs#TATAIPL | #LSGvDC | @DelhiCapitals | @klrahul pic.twitter.com/KhyEgQfauj
— IndianPremierLeague (@IPL) April 22, 2025
సొంతగడ్డపై లక్నోసూపర్ జెయింట్స్ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు మర్క్రమ్(50), మిచెల్ మార్ష్(32)లు చెలరేగి ఆడారు. ముకేశ్, స్టార్క్ బౌలింగ్‌లో బౌండరీలతో విరుచుకుపడ్డారు. వీళ్లిద్దరి జోరుతో పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 51 రన్స్ కొట్టింది లక్నో. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన మర్క్రమ్ జోరు పెంచే క్రమంలో చమీర బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్టబ్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. 87 వద్ద తొలి వికెట్ కోల్పోయిన లక్నోకు స్టార్క్ డేంజరస్ నికోలస్ పూరన్(9)ను వెనక్కి పంపి మరో షాకిచ్చాడు.
Three 4s to start… then it turned into W.O.W 👀
Relive that eventful last over from Mukesh Kumar 🔽https://t.co/09FaSVF1kX#TATAIPL | #LSGvDC | @LucknowIPL | @DelhiCapitals pic.twitter.com/AgBuQm6kPl
— IndianPremierLeague (@IPL) April 22, 2025
ముకేశ్ ఇక తనవంతు అన్నట్లు ఒకే ఓవర్లో అబ్దుల్ సమద్(2), మార్ష్‌ను ఔట్ చేసి లక్నోను దెబ్బతీశాడు. ఆ తర్వాత ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆయుష్ బదొని(36) డేవిడ్ మిల్లర్(14 నాటౌట్)లు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. డెత్ ఓవర్లలో ధాటిగా ఆడి స్కోర్ 150 దాటించారు. ముకేశ్ వేసిన 20వ ఓవర్లో రెచ్చిపోయిన బదొని హ్యాట్రిక్ ఫోర్లు సాధించాడు. కానీ, నాలుగో బంతికి బౌల్డయ్యాడు. పంత్(0) సైతం బౌల్డ్ కావడంతో, లక్నో 159కే పరిమితమైంది.