CPL 2025 : ఫ్రాంచైజీ క్రికెట్లో సిక్సర్ల మోత మోగించే నికోలస్ పూరన్ (Nicholas Pooran) ఈసారి కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. రేపటి నుంచి సొంతగడ్డపై ప్రారంభం కానున్న కరీబియన్ లీగ్‌లో ఈ చిచ్చరపిడుగు ట్రిన్బగో నైట్ రైడర్స్ (Trinbago Knight Riders) కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్ వారసుడిగా పూరన్‌ను ప్రకటిస్తూ ఫ్రాంచైజీ గురువారం వెల్లడించింది. ఈ సీజన్లో ట్రిన్బగోకు హెడ్‌కోచ్‌గా మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సేవలందించనున్నాడు.
తనకు ట్రిన్బగో నైట్ రైడర్స్ కెప్టెన్సీ ఇవ్వడంపై పూరన్ సంతోషం వ్యక్తం చేశాడు. నాయకుడిగా ఉండడం ట్రిన్బగో నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్య వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ఫ్రాంచైజీ సారథిగా ఎంపికవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఆటగాడిగా, కెప్టన్‌గా నా అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. బ్రావో, పొలార్డ్ వారసత్వాన్ని కొనసాగించడం నిజంగా పెద్ద బాధ్యత.
Trinbago Knight Riders have a new captain for #CPL25 🫡
Full story: https://t.co/DXT3g4QiJL pic.twitter.com/kdKXTQMyRL
— ESPNcricinfo (@ESPNcricinfo) August 14, 2025
జట్టులో పొలార్డ్, నరైన్, రస్సెల్ వంటి స్టార్లు ఉండడంతో నా పని తేలికవనుంది అని ఈ లెఫ్ట్ హ్యాండర్ వెల్లడించాడు. ఆగస్టు 15 నుంచి కరీబియన్ ప్రీమియర్ లీగ్ షురూ కానుంది. టిన్బగో జట్టు ఆగస్టు 17న సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్‌తో తలపడనుంది. టీ20లు అంటేనే పూనకం వచ్చినట్టు చెలరేగే పూరన్ సీపీఎల్‌లో ఇప్పటివరకూ 152.27 స్ట్రయిక్ రేటుతో 2,447 రన్స్ బాదాడు. పీఎల్ 18వ సీజన్లో మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన ఈ విధ్వంసక హిట్టర్ ఈసారి ట్రిన్బగోకు టైటిల్ అందిస్తాడా? లేదా? అనేది చూడాలి.