Ricky Ponting : అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ ఎవరు? అనే ప్రశ్న పూర్తికాకముందే ఇంకెవరు డాన్ బ్రాడ్‌మన్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా. వీళ్లు కాదంటే ఈతరం సూపర్ హీరోలు విరాట్ కోహ్లీ (Virat Kohli). జో రూట్.. స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ల పేర్లు చెబుతూ ఉంటాం. కానీ.. వీళ్లెవరు అంత టాలెంటెడ్ క్రికెటర్లు కాదంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ (Ricky Ponting). ఇంతకూ పాంటింగ్ దృష్టిలో మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్ ఎవరో తెలుసా.. ?
దక్షిణాఫ్రికా లెజెండ్ అయిన జాక్వెస్ కలిస్ (Jacques Kallis) ప్రపంచలో అందరికంటే ప్రతిభావంతుడైన క్రికెటర్ అని పాంటింగ్ అభిప్రాయపడుతున్నాడు. అలాగని తానేమీ ఎవరు బెస్ట్ అనే వివాదానికి తెరదీయడం లేదని, ప్రతిభ గల క్రికెటర్ ఎవరు? అనే విషయాన్ని మాత్రమే చెబుతున్నానని ఆసీస్ మాజీ కెప్టెన్ అన్నాడు.
జాక్వెస్ కలిస్
‘నా దృష్టిలో అందరి కంటే ప్రతిభావంతుడైన క్రికెటర్ జాక్వెస్ కలిస్. నేనేదో తమాషాకు ఈ మాట చెప్పడం లేదు. ప్రతిభగల ఆటగాడు అనేదే కాకుండా ప్రతిభగల క్రికెటర్ అనే విషయాన్ని కూడా నేను ప్రస్తావిస్తున్నా. టెస్టు క్రికెట్లో కలిస్ 45 సెంచరీలు కొట్టాడు. 300లకు పైగా వికెట్లూ పడగొట్టాడు. ఇక అత్యధిక క్యాచ్లతోనూ అతడు రికార్డు నెలకొల్పాడు’ అని పాంటింగ్ వెల్లడించాడు.
అంతేకాదు.. ‘సజహసిద్దంగా ప్రతిభావంతుడైన క్రికెటర్ ఎవరు?’ అనే ప్రశ్నకు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (Brian Lara) అని పాంటింగ్ ఠక్కున సమాధానం చెప్పాడు. దాంతో, సచిన్ లేదా మరెవరైనా క్రికెటర్ పేరు చెబుతాడని ఊహించిన వాళ్లంతా ఒకింత షాక్ అయ్యారు.
బ్రియాన్ లారా, సచిన్
ప్రపంచ క్రికెట్లో గొప్ప ఆల్‌రౌండర్‌గా ప్రశంసలు అందుకున్న కలిస్ ఆడినన్ని రోజులు సఫారీ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. ప్రశాంతగా పరుగుల వరద పారించే అతడు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుడు కూడా. అతడు మూడు ఫార్మాట్లలో కలిపి ఏకంగా 25.534 పరుగులు సాధించాడు. అంతేకాదు బంతితోనూ అదరగొడుతూ 577 వికెట్లు సాధించాడు. సుదీర్ఘ కెరీర్లో కలిస్ 166 టెస్టులు, 328 వన్డేలు, 25 టీ20లు ఆడాడు.