Matka Movie | మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మట్కా (Matka). పలాస 1978 సినిమాతో హిట్ అందుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. విజయవాడలో ఈ టీజర్ వేడుక జరుగగా.. ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వరుణ్ తేజ్ వచ్చి సందడి చేశాడు.
అయితే ఈ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రమోషన్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మా నిర్మాత, దర్శకుడు ఉండి.. విజయవాడ అమ్మవారి దీవెనలతో దసరా నవరాత్రి టైంలో స్టార్ట్ చేద్దాం అన్నారు. అందుకే ఇక్కడకు వచ్చి మీ అందరి చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇక్కడ ఉండే వాళ్లందరూ ఫ్యాన్స్ కాదు మా కుటుంబ సభ్యులు. ఎన్నో సంవత్సరాల నుంచి మా పెద్దనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్‌లను ఆదరిస్తున్నారు. ఇక్కడకు వచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి పెద్ద థాంక్స్. నా చివరి సినిమాలల్లో చిన్న చిన్న తప్పులు చేశాను. గద్దలకొండ గణేష్ తర్వాత నువ్వు అలాంటి సినిమాలు చేయట్లేదు ఎందుకు అంటూ నన్ను చాలా మంది అడిగారు. నా నుంచి అలాంటి సినిమా చూస్తున్న వారి కోసమే ఈ మట్కా. థియేటర్లలో ఒక మాస్ జాతరల ఉండబోతుంది ఈ చిత్రం.
అయితే బాబాయ్ నటిస్తున్న ఓజీ చిత్రం గురించి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. ఈ సినిమా కథను ఫస్ట్ నేనే విన్నాను. ఈ చిత్రం ఊహకందనట్లు ఉంటుంది. అప్పటివరకు వెయిట్ చేయండి. అంటూ వరుణ్ తేజ్ చెప్పుకోచ్చాడు.
I’ve heard the story of #TheyCallHimOG before, and no matter how much you anticipate it, it will surpass your expectations.
– #VarunTej at #Matka teaser launch
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) October 5, 2024