ఢిల్లీ: సరిహద్దుల్లో యుద్ద వాతావరణం, ఐపీఎల్ వాయిదా తర్వాత ఆయా జట్లలో విదేశీ ఆటగాళ్లు, కోచ్లు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు మొగ్గు చూపగా పంజాబ్ కింగ్స్ హెడ్కోచ్ రికీ పాంటింగ్ మాత్రం.. ఫ్లైట్ ఎక్కినా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు.
పాంటింగ్ విమానంలో ఉండగానే భారత్, పాక్ కాల్పుల విరమణ ప్రకటన చేయడంతో ఈ ఆసీస్ దిగ్గజం అప్పటికప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తాను దిగిపోవడమే గాక ఆస్ట్రేలియాకు చెందిన స్టోయినిస్, హార్డీ, ఇంగ్లిస్, బార్ట్లెట్నూ స్వదేశానికి వెళ్లకుండా ఆపాడని.. వారికి భరోసానిచ్చి భారత్లోనే ఉండేవిధంగా ఒప్పించాడని కింగ్స్ సీఈవో సతీశ్ మీనన్ తెలిపాడు.