పుదుచ్చరి: పుదుచ్చరిలో అండర్-19 క్రికెట్ కోచ్(U-19 Head Coach) ఎస్ వెంకటరమణపై ప్లేయర్లు దాడి చేశారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ పాండిచ్చరికి హెడ్ కోచ్‌గా చేస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం తమను జట్టుకు ఎంపిక చేయలేదని ముగ్గురు క్రికెటర్లు కోచ్‌పై దాడి చేశారు. కోచ్ తలకు, భుజానికి గాయాలయ్యాయి. తలకు 20 కుట్లు వేశారు. సీదార్పేట్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం కోచ్ వెంకటరమణ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. దాడి చేసిన క్రికెటర్లు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
ఈ కేసుకు చెందిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ రాజేశ్ తెలిపారు. భారతీదశన్ పాండిచ్చరి క్రికెటర్స్ ఫోరమ్ కార్యదర్శి జీ చంద్రన్ ప్లేయర్లను రెచ్చగొట్టినట్లు కోచ్ తన ఫిర్యాదులో తెలిపాడు. డిసెంబర్ 8వ తేదీన సీఏపీ కాంప్లెక్స్‌లో ఇండోర్ నెట్స్ వద్ద ఉన్న సమయంలో సీనియర్ క్రికెటర్లు కార్తికేయన్, అరవిందరాజ్, సంతోష్ కుమారన్ తన వద్దకు వచ్చారని, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడానికి తానే కారణమని చెబుతూ అటాక్ చేశారన్నారు.