వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా నయా సారధి, ఓపెనర్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. ఫుల్‌టైం కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే 60 పరుగులతో.. విండీస్‌ను విజయానికి దూరం చేశాడు. ఈ క్రమంలో తన బుక్‌లోని అన్ని షాట్లూ ఆడిన రోహిత్.. అభిమానులను అలరించాడు.
స్వల్పలక్ష్య ఛేదన కోసం బరిలో దిగిన టీమిండియా ఓపెనర్లు చక్కని ఆటతీరు కనబరిచారు. ముఖ్యంగా రోహిత్ అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తొలి పవర్‌ప్లే చివరి ఓవర్ ఐదో బంతికి తన స్టైల్లో పుల్‌షాట్ ఆడాడు. కీమర్ రోచ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని పుల్ చేసి భారీ సిక్సర్‌గా మలిచాడు.
ఈ షాట్ చూసిన తర్వాత వెస్టిండీస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ టీమ్మేట్ అయిన కీరన్ పొలార్డ్‌కు ఏం చేయాలో తెలియలేదు. రోహిత్ షాట్‌ను చాలా నిస్సహాయంగా చూస్తుండిపోయిన పొలార్డ్ రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Ear Therapy @ImRo45 💉pic.twitter.com/mrEJaU8oyW
— 🎭 (@CloudyCrick) February 6, 2022