న్యూఢిల్లీ: పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లను ప్రధాని మోదీ(PM Modi) ప్రశంసించారు. ఇవాళ ఆయన తన నివాసంలో ఆ అథ్లెట్లను కలిశారు. ఆ క్రీడాకారులకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు 29 పతకాలు వచ్చిన విషయం తెలిసిందే. పతకాలు గెలిచిన పారా అథ్లెట్లను మోదీ ప్రశంసిస్తున్న వీడియోను క్రీడా మంత్రిత్వశాఖ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. పారా అథ్లెట్లతో భేటీ సమయంలో క్రీడామంత్రి మన్సూక్ మాండవీయ, పీసీఐ అధినేత దేవేంద్ర జాజారియాలు ఉన్నారు.
వీల్‌చైర్ షూటర్ అవనీ లేఖరా పారాలింపిక్స్‌లో వరుసగా రెండోసారి గోల్డ్ సాధించారు. ప్రధాని మోదీతో ఆమె ఫోటో దిగారు. పారాలింపిక్స్‌లో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతం, 13 కాంస్య పతకాలను ఇండియా గెలిచింది. మెగా టోర్నీకి 84 మందితో భారత బృందం పారిస్‌కు వెళ్లింది. స్వర్ణ పతక విజేతలకు 75 లక్షలు, సిల్వర్ మెడల్ విన్నర్‌కు 50 లక్షలు, కాంస్య పతక విజేతకు 30 లక్షలు అందజేశారు.
Prime Minister Narendra Modi meets and interacts with para-athletes who represented India in Paralympic Games 2024 pic.twitter.com/bplUGCjriJ
— Jist (@jist_news) September 12, 2024