IND vs ENG: త్వరలో భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఇక్కడకు రానున్న ఇంగ్లండ్‌కు ఆ జట్టు మాజీ స్పిన్నర్ మౌంటీ పనేసర్ కీలక సూచనలు చేశాడు. స్వదేశంలో విరాట్ కోహ్లీ బీస్ట్ మోడ్‌లో ఉంటాడని, అతడిని ఔట్ చేయాలంటే రెచ్చగొట్టడమొక్కటే మార్గమని, అతడితో ఎంత అగ్రెసివ్‌గా ఉంటే అంత ఏకాగ్రత కోల్పోయి ఔట్ అవుతాడని పనేసర్ సూచించాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు అతడు ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
పనేసర్ మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్రత్యేకంగా విరాట్ కోహ్లీ మీదే దృష్టి సారించాలి. అతడి ఇగోను ఆడుకోవాలి. మానసికంగా అతడిని దెబ్బతీయాలి. అంతేగాక వాళ్లు ‘పదేళ్లుగా నువ్వు ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. ఫైనల్లో ఓడిపోయే చోకర్స్’ అని అరవాలి.. కోహ్లీని స్లెడ్జ్ చేయడానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు మొహమాటపడాల్సిన అవసరమేమీ లేదు..’ అని అన్నాడు.
అంతేగాక.. ‘కోహ్లీ స్వదేశంలో ఆడుతున్నప్పుడు బీస్ట్ మోడ్‌లో ఉంటాడు. అతడు క్రీజులో కుదురుకున్నాడంటే తన అసాధారణ బ్యాటింగ్‌తో మ్యాచ్ మొత్తాన్ని మలుపుతిప్పగలడు. కానీ ఉన్న సమస్య అంతా అతడి దూకుడుతోనే. ఇంగ్లండ్ దానినే ఆయుధంగా మలుచుకోవాలి. అలా అయితే కోహ్లీ ఏకాగ్రత కోల్పోయి త్వరగా ఔట్ అవుతాడు..’ అని పనేసర్ ఇంగ్లండ్ ప్లేయర్లకు సూచించాడు.
Monty Panesar said – “Virat Kohli is a beast on home turf. He can change the course of whole geme with his exceptional batting talent but problem with him is his Aggression. And England knowingly will try to provoke him. I think that is the other way to get rid of him”. (IANS) pic.twitter.com/gWM5oILF5A
— CricketMAN2 (@ImTanujSingh) January 20, 2024
ఇంగ్లండ్‌పై కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ ఆ జట్టుపై 28 టెస్టులు ఆడిన విరాట్.. 42.36 సగటుతో 1991 పరుగులు చేశాడు. మరో 9 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌పై టెస్టులలో కోహ్లీ 2 వేల పరుగులు పూర్తవుతాయి. అంతేగాక మరో 152 పరుగులు చేస్తే అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అతడు 9వేల పరుగులు పూర్తిచేసిన క్రికెటర్ అవుతాడు. ప్రస్తుతం కోహ్లీ.. 113 టెస్టులు ఆడి 191 ఇన్నింగ్స్‌లలో 8,848 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 30 అర్థ సెంచరీలున్నాయి.