విశాఖపట్నం : కబడ్డీ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ శుక్రవారం నుంచి ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ మొదలుకానుంది. విశాఖపట్నం వేదికగా నేటి నుంచి ఆరంభం కాబోయే తొలి అంచె పోటీల్లో భాగంగా మొదటి మ్యాచ్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్.. తమిళ్ తలైవాస్ పోరుతో పీకేఎల్ తెరలేవనుంది.
ఏడేండ్ల తర్వాత సాగరతీర నగరం వైజాగ్ ఆతిథ్యమిస్తున్న ఈ సీజన్లో నేడు.. బెంగళూరు బుల్స్, పుణెరి పల్టన్ సైతం తలపడనున్నాయి. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 11 దాకా వైజాగ్లో మ్యాచ్లు జరుగనున్నాయి.