న్యూఢిల్లీ : ఐపీఎల్లో మహిళల లీగ్‌కు రంగం సిద్ధం కాగా ఇప్పుడు కబడ్డీలోనూ మహిళల లీగ్ ఏర్పాటుకు పీకేఎల్(ప్రొ కబడ్డీ లీగ్) నిర్వాహకులు మాషల్ స్పోర్ట్స్ సన్నాహాలు మొదలుపెట్టింది. ప్రొ కబడ్డీ మొదలై దశాబ్దం అయింది. భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య, ప్రపంచ కబడ్డీ సమాఖ్య సహకారంతో మహిళల లీగ్ ప్రారంభించాలని కసరత్తు చేస్తున్నారు.
ఐపీఎల్ సక్సెస్‌తో మహిళల ఐపీఎల్‌కు శ్రీకారం చుట్టిన విధంగానే మహిళల కబడ్డీ లీగ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పురుషుల కబడ్డీ లీగ్ విజయవంతమైన నేపథ్యంలో భారత్‌లో మహిళల కబడ్డీని ప్రోత్సహించేందుకు టోర్నీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు మాషల్ స్పోర్ట్స్ సీఈవో అనుపమ్ గోస్వామి వెల్లడించారు. 2014లోనే మూడు జట్ల మహిళల లీగ్‌ను నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు.