Piyush Chawla on Kohli | ఇంగ్లండ్‌తో రెండో టీ-20 మ్యాచ్‌లో నిస్వార్థంగా కోహ్లీ బ్యాటింగ్
Piyush Chawla on Kohli | ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో జట్టు కోసం విరాట్ కోహ్లీ నిస్వార్థంగా ఆడాడని పీయూష్ చావ్లా చెప్పాడు.
Piyush Chawla on Kohli | ఇంగ్లండ్‌తో రెండవ టీ-20 మ్యాచ్‌లో టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిస్వార్థంగా ఆడాడని వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అన్నాడు. ఇంతకుముందు ఇంగ్లండ్ జట్టుతో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి తొలి టీ-20 మ్యాచ్‌లో జట్టు యాజమాన్యం విశ్రాంతినిచ్చింది. టీ-20 తొలి మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ స్థానే వచ్చిన దీపక్ హుడా అదరగొట్టాడు. రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగిన కోహ్లీ తిరిగి తన స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. అయితే, ఇంగ్లండ్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ చేతిలో కేవలం ఒక్క పరుగుకే ఔటయ్యాడు. దీంతో అభిమానులంతా నిరాశకు గురయ్యారు.
దీనిపై పీయూష్ చావ్లా ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ టీం కోసం ఆలోచించడం వల్లే కోహ్లీ ధాటిగా ఆడి వికెట్ కోల్పోయాడన్నారు. బ్యాటింగ్ పిచ్‌పై షాట్ కొట్టేందుకు వెళ్లి ఔటయ్యాడని చెప్పాడు. జట్టు కోసం ఆయన నిస్వార్థంగా ఆడిన సంగతి గమనించాల్సిన అవసరం ఉందన్నాడు. ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడితే కోహ్లీ మళ్లీ గాడిలో పడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీం ఇండియా అవసరాలకు తగినట్లు తనను తాను మార్చుకుంటాడన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

