ఢిల్లీ: వెటరన్ లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాల పాటు ఆటలో కొనసాగిన చావ్లా.. శుక్రవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో స్పందిస్తూ.. ‘రెండు దశాబ్దాల తర్వాత ఈ అందమైన ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చింది.
నేను ఆట నుంచి వైదొలుగుతున్నా క్రికెట్ మాత్రం ఎప్పటికీ నాతోనే ఉంటుంది’ అని అన్నాడు. త్వరలోనే కొత్త ప్రయాణం మొదలుపెడతానని చెప్పిన అతడు.. అదేంటన్నది మాత్రం స్పష్టం చేయలేదు. కాగా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న చావ్లా.. భారత్ తరఫున మూడు టెస్టులు, 25 వన్డేలు, ఏడు టీ20లు ఆడి 43 వికెట్లు పడగొట్టాడు. జాతీయ జట్టులో పెద్దగా మెరవకపోయినా ఐపీఎల్లో మాత్రం చావ్లాది ప్రత్యేక స్థానం. ఈ లీగ్‌లో 192 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 192 వికెట్లు పడగొట్టాడు.