SA20 Auction : ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లో భారత ఆటగాళ్లకు భారీ షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగబోయే నాలుగో సీజన్ ఎస్ఏ20 వేలం (SA20 Auction) కోసం ఒక్కరంటే ఒక్కరికీ చోటు దక్కలేదు. ఈ మెగా టోర్నీలో ఆడేందుకు 13 మంది భారత క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ, వీళ్లలో ఒక్కరిని కూడా వేలానికి అనుమతించలేదు నిర్వాహకులు. సోమవారం ఆక్షన్ జాబితాలో ఉన్న 531 మంది ఆటగాళ్ల పేర్లను బెట్‌వే ఎస్ఏ20 ఆర్గనైజర్స్ వెల్లడించారు. ఇందులో వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా (Piyush Chawla) సహ పదముగ్గురు భారత క్రికెటర్ల పేరు లేకపోవడం గమనార్హం.
బెట్‌వే ఎస్ఏ20 నాలుగో సీజన్ వేలంలో పీయూష్ చావ్లా రూ.50 లక్షలకు పేరు రిజిష్టర్ చేసుకున్నాడు. కానీ, నిర్వాహకలు అతడిని వేలం తుది జాబితాలోకి పరిగణించలేదు. ఈ మిస్టరీ స్పిన్నర్‌తో పాటు రిజిష్టర్ చేసుకున్న భారత క్రికెటర్లు ఎవంరంటే.. సిద్ధార్థ్ కౌల్, అంకిత్ రాజ్‌పుత్, నిఖిల్ జగా, మహ్మద్ ఫయాద్, అన్సారీ మరూఫ్, మహేశ్ అహిర్, సరుల్ కన్వర్, అనురీత్ సింగ్ కథురియా, ఇమ్రాన్ ఖాన్, వెంకటేశ్ గలిపెల్లి, అతుల్ యాదవ్.
𝐀𝐍𝐍𝐎𝐔𝐍𝐂𝐄𝐌𝐄𝐍𝐓 – #BetwaySA20Auction 𝐒𝐇𝐎𝐑𝐓𝐋𝐈𝐒𝐓 🚨
Full list 🔗 https://t.co/BtmuSK7pQ8
5️⃣4️⃣1️⃣ Players
3️⃣0️⃣0️⃣ SA players
2️⃣4️⃣1️⃣ Overseas players
1️⃣3️⃣3️⃣ Players who qualify for U23 SA player category pic.twitter.com/UyjhrZxqMZ— Betway SA20 (@SA20_League) September 1, 2025
గత మూడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బెట్‌వే ఎస్ఏ20 వేలానికి 800 మంది రిజిష్టర్ చేసుకున్నారు. వీళ్లలో 13 మంది భారతీయులు ఉండగా.. మొత్తంగా 541 మందినే వేలానికి తీసుకున్నారు నిర్వాహకులు. ఇందులో 300 మంది సఫారీ క్రికెటర్లుకాగా.. 241 మంది వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు. ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్, బంగ్లాదేశ్ మాజీ సారథి షకీబుల్ హసన్ వేలం జాబితాలో చోట సంపాదించారు.
𝐒𝐔𝐁𝐒𝐂𝐑𝐈𝐁𝐄 𝐍𝐎𝐖‼️
The #BetwaySA20Auction comes to life on 9 September 🗓️ Remember to click that notification button so that you don’t miss the action! 🖥️
Subscribe now 💻 https://t.co/QVnOc6Rutd pic.twitter.com/MZWcLuJuFm
— Betway SA20 (@SA20_League) August 29, 2025
నాలుగో సీజన్‌కు ఆరుజట్లకు కలిపి 84 స్థానాలు మాత్రమే ఖాళీ ఉన్నాయి. 25 స్లాట్స్ విదేశీయులకు కేటాయించారు. ప్రతి జట్టు స్క్వాడ్‌లో 19 మంది ప్లేయర్లు ఉండాలి. వీళ్లలో కనీసం 9మంది సఫారీలు, 7కు తగ్గకుండా విదేశీ క్రికెటర్లు ఉండేందుకు అంగీకరిస్తారు. సెప్టెంబర్ 9న వేలం జరుగనుంది.
వేలంలో నిలిచిన సఫారీ స్టార్స్: ఎడెన్ మర్క్రమ్, అన్రిచ్ నోకియా, క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంసీ, గెరాల్డ్ కొయెట్జీ, వియాన్ మల్డర్, లుంగి ఎంగిడి, డేవిడ్ బడింగమ్.