చండీగఢ్: ఐపీఎల్-17 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు హోంగ్రౌండ్‌గా ఉన్న ముల్లాన్‌పూర్ స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణను అడ్డుకోవాలని పంజాబ్ అండ్ హర్యానా కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. అవసరమైన పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ఈ స్టేడియాన్ని నిర్మించారని ఆరోపిస్తూ పంజాబ్ యూనివర్సిటీ న్యాయ విద్యార్థి నిఖిల్ పిటిషన్ వేశాడు.
చండీగఢ్‌లోని సెక్టార్-21లో గల పక్షుల అభయారణ్యానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మైదానం.. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ (ఎన్బీడబ్ల్యూఎల్) అనుమతులు తీసుకోకుండానే నిర్మితమైనట్టు పిల్లో పేర్కొన్నాడు.