PCB : ఆసియా కప్‌తో పాటు మహిళల టీ20 వరల్డ్ కప్‌లో విఫలమైన సీనియర్లకు పాకిస్థాన్ బోర్డు షాకిచ్చింది. వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్‌లో మాజీ కెప్టెన్ నిదా దార్ (Nida Dar), ఆల్‌రౌండర్ అలియా రియాజ్(Aliya Riaz)లపై వేటు వేసింది. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ కొందరికీ సెంట్రల్ కాంట్రాక్ట్ కట్టబెడుతూ పాక్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
ఐసీసీ ఈమధ్యే మహిళా క్రికెట్ జట్ల ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్స్‌ను వెల్లడించింది. దాంతో, తరచూ విఫలమవుతున్న సీనియర్లను తప్పించి కొత్తతరం క్రికెటర్ల మీద దృష్టి పెట్టాలనుకుంది పీసీబీ. అందులో భాగంగానే యువ ప్లేయర్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ అప్పగించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి కొత్త కాంట్రాక్ట్‌లు వర్తిస్తాయని పాక్ బోర్డు తెలిపింది. అయితే.. ఎవరికి ఎంత ఇస్తున్నారు? అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.
It Means Nida Dar ka Career End ki Taraf..#Pakistan #NidaDar pic.twitter.com/feblbJmUWU
— Ali Hasan 🏅 (@AaliHasan10) November 16, 2024
మహిళా క్రికెటర్లను నాలుగు విభాగాలుగా విభజిస్తూ పీసీబీ సెంట్రల్ కాంట్రాక్టులు ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ సారథిగా మంచి మార్కులు కొట్టేసిన ఫాతిమా సనా (Fatima Sana), వికెట్ కీపర్ మునీబా అలీలు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ కేటగిరీ దక్కించుకున్నారు. ఇక లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్ కేటగిరీ బీకి ప్రమోట్ అయింది. ఇక యువ క్రికెటర్లు గుల్ ఫెరోజా, రమీన్ షమీమ్, తస్మియా రుబాబ్లు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్‌కు ఎంపికయ్యారు. వీళ్లందరూ విభాగం డీలో చోటు దక్కించుకున్నారు.
కేటగిరీ ఏ – ఫాతిమా సనా, మునీబా అలీ, సిద్రా అమిన్.
కేటగిరీ బీ – నష్రా సుంధు, సదియా ఇక్బాల్.
కేటగిరీ సీ – డయానా బైగ్, ఒమైమా సొహైల్.
కేటగిరీ డీ – గులాం ఫాతిమా, గుల్ ఫెరోజా, నజిహ అల్వీ, రమీన్ షమీమ్, సతాఫ్ షమాస్, సయ్యద అరూబ్ షా, తస్మియా రుబాబ్, తుబా హసన్, ఉమ్మె హనీ.