కరాచీ: వచ్చే ఏడాది తమ దేశంలో జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఎట్టి పరిస్థితుల్లోనూ హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించే ఆస్కారమే లేదన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయానికి ఆ దేశ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ఆతిథ్య హక్కులు తమ వద్దే ఉన్నందున పాక్ ఆవల ఒక్క మ్యాచ్‌నూ నిర్వహించబోమని పీసీబీ తెలిపింది. ఇదే విషయమై పీసీబీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఇక్కడకు రాలేమన్న భారత్ నిర్ణయం గురించి ఐసీసీ మాకు సమాచారం అందించింది. కానీ మా ప్రభుత్వం నుంచి మాకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. మేం ఒక్క మ్యాచ్‌నూ పాక్ ఆవల నిర్వహించే ప్రసక్తే లేదు. చాంపియన్స్ ట్రోఫీ హక్కులు మా వద్దే ఉన్నాయి’ అని తెలిపాడు.