PCB : పాకిస్థాన్ సీనియర్ ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది. గ్లోబల్ టీ20 కెనడా (Global T20 Canda 2024)లో ఆడేందుకు కెప్టెన్ బాబర్ ఆజాం, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌తో పాటు పేసర్ షాహీన్ ఆఫ్రిదీలక అనుమతి నిరాకరించింది. స్వదేశంలో సిరీస్‌ల దృష్ట్యా ఈ సీనియర్ త్రయానికి పీసీబీ ఎన్వోసీ (NOC) ఇవ్వలేదు.
ఈ ఏడాది ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకూ పాక్ జట్టుకు సొంతగడ్డపై బిజీ షెడ్యూల్ ఉంది. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు అయిన ఈ ముగ్గురిపై వర్క్ లోడ్ పడకూడదనేది పీసీబీ ఆలోచన. అందుకనే గ్లోబల్ టీ20 కెనడాలో ఆడేందుకు వీళ్లకు నో చెప్పింది. గ్లోబల్ టీ20 కెనడా జూలై 25వ తేదీన షురూ కానుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పోటీ పడనున్నాయి.