Inzamam-Ul-Haq: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ వైఫల్య ప్రదర్శనల నేపథ్యంలో జట్టుతో పాటు సెలక్షన్ కమిటీలో భారీ మార్పులు ఉంటాయని ఇదివరకే హెచ్చరించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది. వరల్డ్ కప్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ పాకిస్తాన్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశాడు. సోమవారం ఇంజమామ్ తన రాజీనామాను పీసీబీ చీఫ్ జకా అష్రఫ్‌కు పంపించాడు. ఇంజమామ్‌కు చెందిన ఏజెన్సీ తరఫున ఆటగాళ్లకే జట్టులోకి సెలక్ట్ చేశారని అతడిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే విషయమై ఇంజమామ్ స్పందిస్తూ.. ‘కొంతమంది వాస్తవాలు తెలుసుకోకుండానే మాట్లాడుతున్నారు. ఆ ఆరోపణలపై నిజానిజాలు తెలుసుకోవాలి. ఆ దిశగా పీసీబీ రీసెర్చ్ చేయాలి. నాకు ప్లేయర్ ఏజెంట్ కంపెనీతో ఏ సంబంధమూ లేదు..’ అని తెలిపాడు.
ఏంటీ వివాదం..?
ఇస్లామాబాద్ వేదికగా నడిచే ‘యజో ఇంటర్నేషనల్ లిమిటెడ్’ ప్లేయర్స్ ఏజెన్సీలో ఇంజమామ్‌కు పెట్టుబడులున్నాయి. ప్రస్తుతం పాక్ టీమ్ లో ఉన్న బాబర్ ఆజమ్, షహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌తో పాటు మరికొందరికి ఈ సంస్థతో అనుబంధం ఉంది. ఇంజమామ్‌కు అనుకూలంగా ఉండే ఆటగాళ్లనే వరల్డ్ కప్ జట్టులోకి ఎంపిక చేశారన్న ఆరోపణలున్నాయి. ఒకవేళ ఇంజమామ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమైతే అతడిపై తీవ్ర చర్యలుంటాయని పీసీబీ ప్రతినిధులు తెలిపారు. ఆదివారం పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్తో పాటు బాబర్ ఆజమ్ ల ప్రైవేట్ చాట్ లీక్ అవడం.. వన్డే వరల్డ్ కప్ తర్వాత పాక్ సారథి మార్పు వంటి వార్తల నేపథ్యంలో తాజాగా ఇంజమామ్ పదవి నుంచి తప్పుకోవడం ఈ నెవర్ ఎండింగ్ డ్రామాను మరింత రక్తికట్టిస్తున్నది.
Inzimam-ul-Haq has resigned from his Chief Selector post 🚨
He failed to satisfy PCB Management Committee chairman Zaka Ashraf with his answers. Inzimam was inquired regarding having shares of a player management agency/company,#PakistanCricket #PCB #InzimamulHaq #ZakaAshraf pic.twitter.com/MgUfda0hpF— Muhammad Hammad (@Hammadhammi3) October 30, 2023