PBKS vs RR : ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించారు. పంజాబ్ కింగ్స్ తరఫున ముగ్గురు విదేశీ ప్లేయర్స్ మిచ్ ఓవెన్, మాక్రో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్లకు తుది జట్టులో చోటు కల్పించారు.
ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టులో నితీశ్ రాణా స్థానంలో సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా జోఫ్రా ఆర్చర్ స్థానంలో క్వెనా మఫాకాకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించారు.
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (C, WK), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ మధ్వల్, ఫజల్హాక్ ఫరూఖీ.
పంజాబ్ కింగ్స్ : ప్రభ్సిమ్రాన్ సింగ్ (WK), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (C), మిచెల్ ఓవెన్, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్.