బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ పవన్ బర్తాల్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల 55 కిలోల విభాగంలో పవన్.. 5-0తో సవొ రంగ్సె (కంబోడియా)ను మట్టి కరిపించాడు.
బౌట్లో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన బర్తాల్.. పదే పదే ప్రత్యర్థిని బౌట్ కార్నర్ వద్దకు తీసుకెళ్లి పాయింట్లు రాబట్టాడు. అటాకింగ్‌తో పాటు డిఫెన్స్‌లోనూ అతడు కంబోడియా బాక్సర్‌కు పాయింట్లు సాధించే అవకాశమివ్వలేదు.