పుణె : ప్రొ కబడ్డీ లీగ్ టోర్నీలో సోమవారం హర్యానా స్టీలర్స్‌తో జరిగిన పోరులో పట్నా పైరేట్స్ 9 పాయింట్ల తేడాతో 41-32 స్కోరుతో గెలుపొందింది. సచిన్ 13 పాయింట్లు సాధించి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. మహ్మద్ రెజా 6, నీరజ్ 5, అనుజ్ 4, మోను 3, సునీల్ 3 పాయింట్లతో సహకరించారు. హర్యానా జట్టులో మన్జీత్ 10, వినయ్ 4, రాకేష్ 3, నితిన్ 3 పాయింట్లు సాధించారు.
మరో మ్యాచ్‌లో యు ముంబపై జరిగిన పోరులో జైపూర్ పింక్ పాంథర్స్ 42-39 స్కోరుతో గెలుపొందింది. జైపూర్ జట్టులో అర్జున్ దేశ్వాల్ 15, అంకుశ్ 5, భవాని రాజ్‌పుత్ 5, అజిత్ 4, రాహుల్ చౌదరి 3 పాయింట్లు సాధించగా, ముంబ జట్టులో ఆశిష్ 11, జై భగవాన్ 6, హైదరాలి 4 పాయింట్లు సాధించారు.