RCB vs RR : తాడోపేడో తేల్చుకోవాల్సిన ఎలిమినేటర్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluur) బ్యాటర్లు దంచలేకపోయారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల విజృంభణతో టాపార్డర్ చేతులెత్తేసింది. అవేశ్ ఖాన్(344), అశ్విన్(219)లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 రన్స్‌కే పరిమితమైంది. ఓపెనింగ్ జోడీ విరాట్ కోహ్లీ(33), ఫాఫ్ డూప్లెసిస్(17)లు స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరిన వేళ.. రజత్ పాటిదార్(34), మహిపాల్ లొమ్రోర్(32)లు ఉతికేశారు. చివర్లో దినేశ్ కార్తిక్(11) ఇంప్యాక్ట్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్(9 నాటౌట్) బ్యాటింగ్ మెరపులతో ఆర్సీబీ పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.
టాస్ ఓడిన ఆర్సీబీని ట్రెంట్ బౌల్ట్ ఆదిలోనే వణికించాడు. తొలి ఓవర్లో రెండు పరుగులు, ఆ మరుసటి ఓవర్లో 3 పరుగులే ఇచ్చాడు. అయితే.. సందీప్ శర్మ, అవేశ్ ఖాన్‌లను టార్గెట్ చేసిన కోహ్లీ(33), డూప్లెసిస్(17)లు బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దాంతో, శాంసన్ పవర్ ప్లేలోనే బౌల్ట్‌కు మూడో ఓవర్ వేసిన బౌల్ట్ బెంగళూరు కెప్టెన్ డూప్లెసిస్‌ను ఔట్ చేసి రాజస్థాన్‌కు బ్రేకిచ్చాడు. లాంగాఫ్‌లో పావెల్ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టడంతో 37 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ పడింది.
Four overs to go!
Mahipal Lomror & Dinesh Karthik aim to finish on a high 🔥
Follow the Match ▶️ https://t.co/b5YGTn7pOL#TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/EVdq53rI8U
— IndianPremierLeague (@IPL) May 22, 2024
ఆ కాసేపటికే చాహల్ స్లో బాల్‌తో విరాట్ కోహ్లీని వెనక్కి పంపాడు. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్ (27), పాటిదార్(34)లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ, స్పిన్ మాంత్రికుడు అశ్విన్ వరుస బంతుల్లో గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్(0)లను పెవిలియన్ పంపి ఆర్సీబీ భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆదుకుంటాడనుకున్న దినేశ్ కార్తిక్(11) సైతం నిరాశపరచగా… మహిపాల్ లొమ్రోర్(32) బౌండరీలతో చెలరేగాడు. వీళ్లిద్దరూ ఆరో వికెట్‌కు 32 రన్స్ జోడించి జట్టు స్కోర్ 150 దాటించారు. ఆఖర్లో స్వప్నిల్ సింగ్(9) మెరుపులతో రాజస్థాన్‌కు ఆర్సీబీ ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
Innings Break!
A target of 1️⃣7️⃣3️⃣ set by #RCB 🎯
Who is going to #Qualifier2 ? 🤔
Chase on the other side 👉
Scorecard ▶️ https://t.co/b5YGTn7pOL #TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/54RfT3O9pO
— IndianPremierLeague (@IPL) May 22, 2024