IPL 2025 : చెపాక్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ కొట్టింది. కెప్టెన్ రజత్ పాటిదార్(51) సూపర్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. చెన్న సూపర్ కింగ్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పాటిదార్ విరాట్ కోహ్లీ(31)తో విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(32), టిమ్ డేవిడ్(22)లు ధానధన్ ఆడారు. సామ్ కరన్ వేసిన 20వ ఓవర్లో టిమ్ డేవిడ్ రెచ్చిపోయాడు. వరుసగా మూడు సిక్సర్లు బాదడంతో ఆర్సీబీ స్కోర్ 190 దాటింది. నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. టర్నింగ్ పిచ్ మీద ఇది కొండంత లక్ష్యమే. అయితే.. తమకు అచ్చొచ్చిన మైదానంలో మరోసారి ఆర్సీబీకి చెన్నై జట్టు చెక్ పెడుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్ బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెలరేగిన ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(32), చెపాక్‌లోనూ చితక్కొట్టాడు. విరాట్ కోహ్లీ(16)తో కలిసి జట్టుకు శుభారంభం ఇచ్చాడు. విరాట్ తడబడినా సాల్ట్ తన విధ్వంసంతో ఆర్సీబీ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నూర్ అహ్మద్ విడదీశాడు.
Innings Break ‼
Solid show with the bat by @RCBTweets 👏👏
They put up a target 🎯 of 1️⃣9️⃣7️⃣ for #CSK
Which way is this one going? 🤔
Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB pic.twitter.com/ZUtXTDeSDi
— IndianPremierLeague (@IPL) March 28, 2025
ఫ్రంట్‌ఫుట్ వచ్చిన సాల్ట్‌ను ధోనీ మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు. దాంతో, 45 వద్ద ఆర్సీబీ మొదటి వికెట్ పడింది. అనంతరం కోహ్లీ జతగా దేవ్‌దత్ పడిక్కల్(27) దూకుడు కొనసాగించాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో 4, 4, 6 బాదడంతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. అయితే.. వేగంగా ఆడే క్రమంలో పడిక్కల్.. అశ్విన్ బౌలింగ్‌లో గైక్వాడ్ చేతికి దొరికిపోయాడు.
పడిక్కల్ ఔటయ్యాక కోహ్లీ సహకారంతో రజత్ పాటిదార్(51 : 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 10 ఓవర్లకు 93-2తో పటిష్ట స్థితిలో ఉన్న ఆర్సీబీని నూర్ అహ్మద్ దెబ్బకొట్టాడు. విరాట్ వికెట్ పడ్డాక.. లియాం లివింగ్‌స్టోన్(10), జితేశ్ శర్మ(12)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సరే పెద్ద షాట్లు ఆడిన రజత్.. జట్టు స్కోర్ 170 దాటించాడు. ఆ తర్వాత పథిరన బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి సామ్ కరన్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్లో తడబడిన కృనాల్ పాండ్యా(0)సైతం సున్నాకే డగౌట్ చేరాడు. 20వ ఓవర్లో రెచ్చిపోయిన టిమ్ డేవిడ్(22) హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. దాంతో, ఆర్సీబీ ప్రత్యర్థి ముందు 197 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
How do you reply after you are hit for a six? 🤔
Noor Ahmad says TIMBER STRIKE 🎯
Updates ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL | @noor_ahmad_15 pic.twitter.com/5iPkPjxWwe
— IndianPremierLeague (@IPL) March 28, 2025