మెల్బోర్న్: పాకిస్థాన్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా 79 రన్స్ తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 237 రన్స్‌కే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్(Pat Cummins) రెండో ఇన్నింగ్స్‌లోనూ 5 వికెట్లు తీశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అతను మొత్తం 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు 57 టెస్టులు ఆడిన కమ్మిన్స్.. రెండోసారి పది వికెట్లును తీసుకున్నాడు.
Australia win the second Test by 79 runs.#AUSvPAK pic.twitter.com/nRYnHujU8W
— Pakistan Cricket (@TheRealPCB) December 29, 2023
పాక్ బ్యాటర్లలో షాన్ మసూద్ 60, ఆఘా ఖాన్ 50 రన్స్ చేశారు. ఆసీస్ బౌలర్లను కొంత వరకు ధీటుగానే ఎదుర్కొన్న పాక్ బ్యాటర్లు.. ఆసీస్ పేస్ జోరు ముందు తలవంచక తప్పలేదు.
దీంతో టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకున్నది. ఇక మూడవ టెస్టు జనవరి మూడవ తేదీ నుంచి సిడ్నీలో ప్రారంభంకానున్నది.
స్కోరు బోర్డు
ఆస్ట్రేలియా 318, 262
పాకిస్థాన్ 264, 237