Parvez Rasool | జమ్మూ కశ్మీర్ ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్ తన క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత జట్టు తరఫున, ఐపీఎల్లో ఆడిన జమ్మూకశ్మీర్‌కు చెందిన తొలి క్రికెటర్ రసూల్. 2008లో ఎంట్రీ ఇచ్చిన రసూల్ ఇప్పటి వరకు 95 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 164 లిస్ట్-ఎ, 71 టీ20 మ్యాచ్‌లో ఆడాడు. మిడిల్ ఆర్డర్లో మంచి సహకారం అందించిన ఈ కుడిచేతివాటం ఆఫ్ స్పిన్నర్ 2024లో భారత జట్టు తరఫున ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. 2017లో విరాట్ కెప్టెన్సీలో ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. కాన్పూర్‌లో ఇంగ్లండ్‌పై ఆడిన తన ఏకైక టీ20 మ్యాచ్‌లో అతను 5 పరుగులు చేసి, 32 పరుగులు ఇచ్చి ఇయాన్ మోర్గాన్ వికెట్ పడగొట్టాడు. పర్వేజ్ రసూల్ 2014 జూన్‌లో బంగ్లాదేశ్‌తో మీర్పూర్లో ఓ వన్డే మ్యాచ్‌లో ఆడాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
ఈ సందర్భంగా రసూల్ మాట్లాడుతూ తాము క్రికెట్ ఆడడం ప్రారంభించిన సమయంలో చాలామంది జమ్మూ క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోలేదని.. కానీ, తాము కొన్ని పెద్ద జట్లను ఓడించామని తెలిపాడు. రంజీ, బీసీసీఐ అనుబంధ టోర్నీల్లోనూ రాణించినట్లు చెప్పాడు. తాను చాలాకాలం జట్టుకు నాయకత్వం వహించానని.. జట్టు విజయంలో కొంత వరకు దోహదపడడం తనకు సంతృప్తినిచ్చిందని రసూల్ పేర్కొన్నాడు. తాను జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ప్రతీసారి విజేతగా నిలిచేలా చూసుకోవడమే తన లక్ష్యమని.. కొన్నిసార్లు ఫలితాలు తమకు అనుకూలంగా రాలేదని చెప్పాడు. కానీ, జమ్మూ కశ్మీర్ కోసం తన సామర్థ్యం మేరకు ప్రదర్శన ఇచ్చేందుకు తాను చేయగలిగినంత చేశానని రసూల్ తెలిపాడు. రసూల్ ఐపీఎల్లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని పుణే వారియర్స్ ఇండియాలో రసూల్‌ని తీసుకున్నారు. ఆ తర్వాత ఎడిషన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. రసూల్ మొత్తం మీద 352 ఫస్ట్ క్లాస్ వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ మ్యాచులలో 221, టీ20ల్లో 60 వికెట్లు తీశాడు.