వారణాసి: ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని మోదీ(PM Modi) ఫైర్ అయ్యారు. అధికారంపై ఫోకస్ పెట్టిన ప్రతిపక్ష పార్టీ.. కేవలం వాళ్ల స్వంత కుటుంబాలను ప్రమోట్ చేసుకుంటున్నాయని ప్రధాని ఆరోపించారు. సుమారు 3880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు ఇవాళ ప్రధాని మోదీ వారణాసిలో శంకుప్తాపన చేశారు. సబ్కా సాత్, సబ్ కా వికాస్ అన్న మంత్రంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని, ప్రతి పౌరుడి అభ్యుదయం కోసం ముందుకు వెళ్తున్నామన్నారు. కానీ అధికారం కోసం ఎదురుచూస్తున్న వాళ్లు పగలూరాత్రీ రాజకీయ నాటకాలు చేస్తున్నట్లు ఆరోపించారు. జాతీయ ప్రయోజనాలను పక్కనబెట్టి కుటుంబం మొత్తం కుటుంబం డెవలప్మెంట్ కోసం చూస్తోందని విమర్శించారు. అధికారం కోసం రాజకీయాలు చేస్తే వాళ్లు.. పారివార్కా సాత్, పరివార్ కే వికాశ్ అన్న రీతిలో వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు.
#WATCH | Uttar Pradesh: PM Narendra Modi greets the people of Varanasi in Bhojpuri.
He says, “Kashi belongs to me, I belong to Kashi.” pic.twitter.com/mhM3BbvZ7D
— ANI (@ANI) April 11, 2025
గతంలో పూర్వాంచల్‌లో ఆరోగ్య కేంద్రాలు ఉండేవికావు అని, కానీ ఇప్పుడు కాశీ ఈ ప్రాంతానికి ఆరోగ్య రాజధానిగా మారిందన్నారు. పదేళ్ల క్రితం ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు కాశీ హెల్త్ క్యాపిటల్ అయ్యిందన్నారు. ఢిల్లీ, ముంబైకి చెందిన పెద్ద పెద్ద ఆస్పత్రులు ఇప్పుడు కాశీలో అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. గత పదేళ్లలో బనారస్ వేగంగా మారిందని, కాశీ తన వారసత్వాన్ని కాపాడుకున్నదని, దివ్యమైన భవిష్యత్తు దిశగా వెళ్లోందని, ఇప్పుడు ఇది ప్రాచీన పట్టణం మాత్రమే కాదు అని, ఇది ప్రగతిశీల నగరంగా మారిందన్నారు. పూర్వాంచల్ అభివృద్ధిలో కాశీ కీలక పట్టణంగా మారినట్లు చెప్పారు.