Paris Olympics 2024 : పారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలింపిక్స్లో షూటర్ మను భాకర్ పతకం దిశగా అడుగు ముందుకేసింది. భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటింగ్ విభాగంలో షూటర్ మను భాకర్ సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆమె ఫైనల్కు దూసుకెళ్లింది.
దాంతో పారిస్ ఒలింపిక్స్ 2024 లో ఫైనల్కు చేరిన తొలి భారత క్రీడాకారిణి అయ్యారు. మను భాకర్ 580-27x స్కోరుతో క్వాలిఫయింగ్ రౌండ్లో 3వ స్థానంలో నిలిచి.. ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నారు. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్యాలిఫికేషన్లో మరో భారత షూటర్ రిథమ్ సంగ్వాన్ 573 పాయింట్లతో 15వ స్థానానికి పరిమితమయ్యారు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ జూలై 28 ( ఆదివారం) మధ్యాహ్నం 3.30 గంటలకు షురూ అవుతుంది. ఇందులో మను క్వాలిఫికేషన్ రౌండ్లో మొదటి స్థానంలో నిలిచిన హంగేరి క్రీడాకారిణి మేజర్ వెరోనికా, రెండో స్థానంలో నిలిచిన హో యే జిన్ల నుంచి గట్టి పోటీని ఎదుర్కోనుంది.