India | హాకీలో భారత జట్టు రెండో విజయాన్ని నమోదుచేసింది. పూల్-బీ లో భారత్ 2-0తో ఐర్లాండ్‌ను చిత్తు చేసి నాకౌట్ దశకు మరింత చేరువైంది. న్యూజిలాండ్‌తో నెగ్గినా అర్జెంటీనాతో కష్టపడిన మెన్ ఇన్ బ్లూ.. ఐర్లాండ్‌తో మాత్రం అదరగొట్టారు.
మ్యాచ్‌లో బంతిని ఎక్కువభాగం ప్రత్యర్థి ఆధీనంలోనే ఉంచి పదే పదే వారి గోల్‌పోస్ట్ పైకి దాడికి దిగారు. భారత స్టార్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ 13, 19వ నిమిషాల్లో వరుస గోల్స్ చేశాడు. ఐర్లాండ్‌కు పదే పదే పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ వాటిని విజయవంతంగా అడ్డుకున్నాడు. గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్‌లు ఆడనున్న భారత్.. ఒక్కటి గెలిచినా నాకౌట్ బెర్తును ఖాయం చేసుకుంటుంది.