Cindy Ngamba | పారిస్: విశ్వక్రీడల్లో ఒలింపిక్ జెండా కింద ఆడుతున్న ‘ఒలింపిక్ శరణార్థుల జట్టు’కు ప్రాతినిథ్యం వహిస్తున్న కామెరూన్ బాక్సర్ సిండి ఎంగంబ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన మహిళల 75 కిలోల బాక్సింగ్ క్వార్టర్స్‌లో ఎంగంబ 5-0తో అథీనా బైలొన్ (ఫ్రాన్స్)ను మట్టికరిపించింది.
ఈ గెలుపుతో ఆమె ఒలింపిక్ రిఫ్యూజీ టీమ్‌కు మొదటి పతకాన్ని అందించేందుకు సిద్ధమైంది. సెమీస్‌లో గెలిచి తాను స్వర్ణం లేదా రజతం సాధిస్తానని మ్యాచ్ అనంతరం ఎంగంబ తెలిపింది.