న్యూఢిల్లీ: టోక్యో 2020 పారా ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్(Pramod Bhagat)పై 18 నెలల నిషేధం విధించినట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించింది. యాంటీ డోపింగ్ నియమావళిని ఉల్లంఘించినట్లు బీడబ్ల్యూఎఫ్ పేర్కొన్నది. 12 నెలల వ్యవధిలోనే షట్లర్ భగత్ మూడు సార్లు పరీక్షలో విఫలమైనట్లు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ తెలిపింది. దీంతో ప్రమోద్ భగత్.. పారిస్ 2024 పారాఒలింపిక్ గేమ్స్‌కు దూరంకానున్నాడు. భగత్ చేసిన అప్పీల్‌ను సీఏఎస్ అప్పీల్స్ డివిజన్ జూలై 29వ తేదీన రద్దు చేసింది. అనర్హత వేటు తక్షణమే అమలులోకి వస్తుందని సీఏఎస్ తెలిపింది.
ఇటీవల థాయ్‌ల్యాండ్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఎస్ఎల్3 టైటిల్‌ను ప్రమోద్ భగత్ నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో అతను ఇంగ్లండ్‌కు చెందిన డానియల్ బేతల్‌ను ఓడించాడు.35 ఏళ్ల భగత్ 14-21, 21-15, 21-15 స్కోరుతో డానియల్‌పై గెలిచాడు. సింగిల్స్‌లో నాలుగుసార్లు ప్రపంచ టైటిళ్లు అతను సొంతం చేసుకున్నాడు. 2015, 2019, 2022 సంవత్సరాల్లో ఆ టైటిల్స్ అతను గెలిచాడు.
UPDATE: Indian #Parabadminton #Tokyo2020 gold medallist Pramod Bhagat suspended for 18 months for breaching BWF anti-doping regulations with three whereabouts failures within 12 months. #Paris2024 #Paralympicshttps://t.co/YLdD7BWI5N
— BWF (@bwfmedia) August 13, 2024