ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ‘ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర’ అవార్డుల వివాదం నానాటికీ ముదురుతోంది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై సాధారణ క్రీడాకారులతో సమానంగా తామూ పతకాలు సాధిస్తున్నప్పటికీ అవార్డుల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని పారాలింపియన్లు గళమెత్తుతున్నారు. డబుల్ పారాలింపిక్స్ మెడలిస్ట్.. డిస్కస్ త్రోయర్ యోగేశ్ ఖతునియా శనివారం ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘ఇది క్రీడా మంత్రిత్వ శాఖ పరిధికి సంబంధించిన అంశం.
అవార్డుల విషయంలో వాళ్లు న న్ను ఇంతవరకూ సంప్రదించలేదు. మంచి పీఆర్లు కలిగినవారికే అవార్డులు వస్తున్నాయనేది బహిరంగ సత్యం. మాలాంటి క్రీడాకారులను వాళ్లు విస్మరిస్తున్నారు. దీనిపై నాకు మరో ఏడాది వేచి చూసే ఓపిక లేదు. నేను కచ్చితంగా హైకోర్టుకు వెళ్తా. ఖేల్త్న్ర రావడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నాకెందుకు ఇవ్వడం లేదో రాతపూర్వకంగా తెలుసుకోవాలనుకుంటున్నా’ అని అసహనం వ్యక్తం చేశాడు.