న్యూఢిల్లీ: బహ్రెయిన్ పారా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ ప్రమోద్ భగత్ సత్తాచాటాడు. తన అద్బుత ప్రదర్శన కనబరుస్తూ టోర్నీలో రెండు స్వర్ణాలు సహా ఒక కాంస్య పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషుల ఎస్ఎల్3 విభాగం ఫైనల్లో భగత్ 21-16, 21-17తో నితీశ్‌కుమార్‌పై వరుస గేమ్‌ల్లో విజయం సాధించాడు.