Rishabh Pant : భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఐపీఎల్ భవితవ్యంపై రోజుకో మాట వినిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని అట్టి పెట్టుకుంటుందా? లేదా? అనేది తెలియడం లేదు. మరోవైపు ఈ డాషింగ్ బ్యాటర్ 18వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kingsకు ఆడుబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
ఆ ఫొటోలో పంత్ ”కబాలి'(Kabali) సినిమాలో రజినీ కాంత్(Rajinikanth) మాదిరిగా స్టయిల్‌గా కూర్చొని ఉన్నాడు. తమిళ ప్రజలు ఎంతగానో ఆరాధించే తలైవా గెటప్‌లో పంత్ కనిపించేసరికి.. ఫ్రాంచైజీ మారుతున్నావా? చెన్నై సూపర్ కింగ్స్‌కి వస్తున్నావా? అంటూ అభిమానులు కామెంట్లు పెడతున్నారు.
పంత్ సీఎస్కేకు ఆడాలనకోవడం వెనక మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) హస్తం ఉండొచ్చని కొందరి అభిప్రాయం. ఎందుకంటే..? పదిహేడో సీజన్లో కెప్టెన్సీ వదిలేసిన మహీ భాయ్ మరో సీజన్ ఆడడం సందేహమే. దాంతో, వికెట్ల వెనకాల ధోనీలా చురుకుగా ఉండే, బ్యాటుతోనే విధ్యంసం సృష్టించే పంత్ సీఎస్కే కూర్పులో చక్కగా సరిపోతాడు. అందుకని చెన్నై సైతం వేలంలో లేదంటే ట్రేడింగ్ పద్ధతిలో పంత్‌ను కొనేందుకు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది.
రెండేండ్ల క్రితకం కారు యాక్సిడెంట్లో పంత్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. మోకాలి సర్జరీ, ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో కఠోర వ్యాయామాల తర్వాత ఈ యంగ్‌స్టర్ ఫిట్నెస్ సాధించాడు. దాదాపు ఏడాది విరామం అనంతరం పంత్ 17వ సీజన్‌తో ఐపీఎల్లో పునరాగమనం చేశాడు. ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్ నుంచి పగ్గాలు అందుకొని మళ్లీ సారథిగా ఢిల్లీని నడిపించాడు. అయితే.. ఆటగాడిగా మునుపటి ఫామ్ అందుకున్న ఈ డాషింగ్ బ్యాటర్ జట్టను ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయాడు. దాంతో, ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ మేనేజ్మెంట్ కొత్త కెప్టెన్ వేటకు సిద్ధమైంది.