IAF fighter jet | పొరపాటున క్షిపణిని ప్రయోగించిన ఐఏఎఫ్ జెట్.. దర్యాప్తునకు ఆదేశం
IAF fighter jet | భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు చెందిన యుద్ధ విమానం పొరపాటున ఒక క్షిపణిని ప్రయోగించింది. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.
జైపూర్: భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు చెందిన యుద్ధ విమానం (IAF fighter jet) పొరపాటున ఒక క్షిపణిని ప్రయోగించింది. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. సాంకేతిక లోపం కారణంగా అనుకోకుండా ‘ఎయిర్ స్టోర్’ (పేలోడ్) రిలీజ్ అయ్యిందని ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) అధికారులు తెలిపారు. కారణాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు చేప్తున్నట్లు చెప్పారు. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు.
కాగా, ఐఏఎఫ్ ఈ విషయాన్ని ధృవీకరించింది. బుధవారం ఎక్స్లో పోస్ట్ చేసింది. ‘సాంకేతిక లోపం కారణంగా ఈ రోజు పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ ఏరియా సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి ‘ఎయిర్ స్టో’ర్ అనుకోకుండా విడుదలైంది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఐఏఎఫ్ ఆదేశించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు’ అని అందులో పేర్కొంది.
An inadvertent release of an air store from an Indian Air Force (IAF) fighter aircraft took place near Pokhran firing range area, due to technical malfunction, today. An enquiry by the IAF has been ordered to investigate into the incident. No damage to life or property has been…
— Indian Air Force (@IAF_MCC) August 21, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

